విరాట పర్వం పై స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Jun 20, 2022 11:04 am IST

రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాట పర్వం విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంటుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టార్ డైరెక్టర్ నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాపై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ ప్రశంసలు కురిపించారు. అతను ట్విట్టర్‌ వేదిక గా సినిమా పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

విరాట పర్వం ఇటీవలి కాలంలో నేను చూసిన ఉత్తమ తెలుగు చిత్రం. నిర్మాతలు మరియు దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని ఎలాంటి రాజీ లేకుండా తీసినందుకు చాలా ప్రశంసలు అందుకోవాలి. ఈ పాత్రను అంగీకరించి మరియు చేసినందుకు రానా దగ్గుబాటికి ప్రత్యేక అభినందనలు మరియు సాయి పల్లవి అద్భుతంగా చేసింది అంటూ చెప్పుకొచ్చారు. పా రంజిత్ మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, నందితా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో SLV సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :