‘బాహుబలి’ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా స్టార్ డైరెక్టర్ !

23rd, March 2017 - 06:01:46 PM


జక్కన్న రాజమౌళి బాహుబలి సిరీస్ ను ఎంత గొప్పగా, వైభవంగా తెరకెక్కించాడో ‘బాహుబలి-2’ ఆడియో వేడుకను కూడా అంతే గొప్పగా ప్లాన్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. బాహుబలి జన్మ స్థలమైన మాహిష్మతి సామ్రాజ్యంలోనే ఆడియో కార్యక్రమం జరిగే బాగుంటుందని రాజమౌళి ఫిల్మ్ సిటీని వేదికగా నిర్ణయించారు.

పూర్తిగా ప్రత్యేకంగా జరగనున్న ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జొహార్ కూడా విశిష్ట అతిధిగా హాజరుకానున్నారు. బాహుబలి చిత్రం భారతీయ సినిమాగా రూపాంతరం చెందడానికి కరణ్ జోహార్ కృషి కూడా చాలా ఉంది. ఆయన సినిమాను తన ధర్మ ప్రొడక్షన్స్ తరపున డిస్ట్రిబ్యూట్ చేస్తూ అద్భుతమైన ప్రచారం కల్పించడంతో బాలీవుడ్ లో సైతం బాహుబలి నెంబర్ 1 స్థానంలో నిలబడగలిగింది. ఇకపోతే ఈ ఆడియో వేడుక మార్చి 26న సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనుంది.