లారెన్స్ ని ప్రశంసించిన శంకర్

shankar-lawrens
లారెన్స్ తనకు బాగా అచ్చొచ్చిన హర్రర్ సినిమాల జోనర్ ని వదలకుండా చేసిన ప్రయత్నం కాంచన 2 సూపర్ హిట్ అయ్యింది. గత శుక్రవారం విడుదలైన తమిళ వెర్షన్ కి విపరీతమైన క్రేజ్ సంతరించుకుంది. కలెక్షన్ ల విషయంలో పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.

నృత్య దర్శకుడి నుండి దర్శకుడిగా విజయం సాధించినందుకు లారెన్స్ పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాదిన స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన శంకర్ ఈ సినిమాను చూసి ట్విట్టర్ లో ప్రశంసించాడు. తన నటనకు, తెరకెక్కించిన దాసోహమైనట్టు తెలిపాడు. కోవై సరళ నటన హై లైట్ అని చెప్పుకొచ్చారు. గత వెర్షన్ ని రజినీ ప్రశంసించిన సంగతి తెలిసినదే. గంగ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు.

Exit mobile version