‘ఆకాశం నీ హద్దురా !’ అంటున్న అక్షయ్ కుమార్.. వర్కౌట్ అవుతుందా ?

Published on Apr 25, 2022 1:00 pm IST

దర్శకురాలు సుధా కొంగరకి దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. ఇక త్వరలోనే నార్త్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమె పేరు బాగా వినిపించబోతుంది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ‘ఆకాశం నీ హద్దురా !’ చిత్రం పెద్ద విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ ఈ సినిమాకు గొప్ప ప్రశంసలు దక్కాయి.

మరీ ముఖ్యంగా హీరో సూర్యలోని పరిపూర్ణమైన నటుడిని సుధా కొంగర ఆవిష్కరించిన విధానం సినిమాకు మేజర్ ప్లస్ అయింది. అందుకే.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపించాడు. ‘ఆకాశం నీ హద్దురా !’ చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.

జి.ఆర్. గోపినాథ్ వాస్తవ జీవిత కథకు కొంత కల్పిత కథనాన్ని జోడించి సుధా కొంగర సినిమాను రూపొందించిన తీరు సౌత్ లో బాగా వర్కవుట్ అయింది. మరి హిందీలో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది ఏమో చూడాలి.

సంబంధిత సమాచారం :