స్పైడర్ ఈవెంట్ లో అరుదైన ఘట్టం ?


సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న స్పైడర్ చిత్రం సప్టెంబర్ 27 న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై నెలకొని ఉన్న అంచనాల దృష్ట్యా ప్రమోషన్ ఈవెంట్ లని కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 8 న చెన్నై లో జరిగే స్పైడర్ ఈవెంట్ ద్వారా మహేష్ బాబుని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరుకానునట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ విషయం గురించి రజినీ ని కలసినట్లు చెబుతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో ఈచిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. రజిని ఈ కార్యక్రమానికి హాజరైతే ఇద్దరు సూపర్ స్టార్ లని ఒకేవేదికై చూసే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైనట్లే.