మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో !

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘మజిలీ’ ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 30 న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా రానున్నాడని సమాచారం. ఇక వీరిద్దరు కలిసి ప్రస్తుతం వెంకీమామ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు.

‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మజిలీ లో నటి దివ్యంకా కౌశిక్ మరో హీరోయిన్ గా నటించగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version