దర్శకుడి అవతారమెత్తిన స్టార్ హీరో

power
తమిళ, తెలుగు భాషల్లో హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరుగా చలామణీ అవుతూ వస్తోన్న ధనుష్, హీరోగా, నిర్మాతగా, గాయకుడిగా.. ఇలా చాలా పాత్రల్లో అభిమానులను మెప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతూ ‘పవర్ పాండి’ అనే సినిమా మొదలుపెట్టేశారు. తన సొంత బ్యానర్ అయిన వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

తమిళంలో నటుడిగా మంచి పేరున్న రాజ్ కిరణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విశాల్ నటించిన ‘పందెం కోడి’ అన్న సినిమాతో రాజ్ కిరణ్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మొదటిసారి దర్శకత్వం చేయనుండడంతో సినిమా కోసం ధనుష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. వచ్చే నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.