లేటెస్ట్ : థమన్ పై ట్విట్టర్ లో నెగటివ్ ట్రెండ్ చేస్తున్న స్టార్ హీరో ఫ్యాన్స్

లేటెస్ట్ : థమన్ పై ట్విట్టర్ లో నెగటివ్ ట్రెండ్ చేస్తున్న స్టార్ హీరో ఫ్యాన్స్

Published on Feb 5, 2023 2:01 AM IST


ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు ఎస్ థమన్. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలవైకుంఠపురములో మూవీకి అద్భుతమైన సాంగ్స్ అందించిన థమన్ కి ఏకంగా జాతీయ అవార్డు కూడా లభించింది. లేటెస్ట్ గా నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక సక్సెస్ అందుకున్న థమన్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తోన్న SSMB 28 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు కొద్దిసేపటి నుండి ట్విట్టర్ లో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ థమన్ పై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు.

#RemoveThamanFromSSMB28 అంటూ వారు చేస్తున్న ట్రెండ్ ప్రస్తుతం టాప్ లో కొనసాగుతూ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. నిజానికి థమన్ పై ఒక్కసారిగా ఈ నెగటివ్ ట్రెండ్ కి కారణం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. తమ హీరో నటిస్తున్న SSMB 28 మూవీకి థమన్ అదిరిపోయే రేంజ్ లో సాంగ్స్, బీజీఎమ్ ఇవ్వాల్సిందే అని, గతంలో తమ సూపర్ స్టార్ తో చేసిన సర్కారు వారి పాట విషయంలో థమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ అందించలేదని కొందరు మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తన పై జరుగుతున్న ఈ నెగటివ్ ట్రెండ్ పై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించిన థమన్, బయట తనపై పిల్లలు చేస్తున్న నెగటివ్ ట్రెండ్ కి రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు