సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ తెలుగు సహా తమిళ సినిమా దగ్గర మంచి బజ్ తో సినిమాలు పెద్దగా రాలేదు. కానీ ఈ ఫిబ్రవరిలో మాత్రం పలు ప్రముఖ సినిమాలు తెలుగు స్టేట్స్ లో సందడి చేసేందుకు వస్తున్నాయి. అయితే ఈ చిత్రాల్లో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన తండేల్ ఒకటి కాగా తమిళ్ నుంచి స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన అవైటెడ్ సినిమా “పట్టుదల” కూడా వస్తుంది.
అయితే వీటిలో అజిత్ సినిమాకి మాత్రం తెలుగులో జీరో బజ్ తోనే వస్తుంది అని చెప్పాలి. మేకర్స్ లాస్ట్ మినిట్ లో తెలుగు వెర్షన్ ని అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా కనీసం మినిమమ్ ప్రమోషన్స్ కూడా తెలుగులో చేసుకోలేకపోయింది. దీనితో అజిత్ లాంటి హీరో సినిమా రేపు ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది అని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి లాస్ట్ టైం తెగింపు సినిమాకి కూడా ఇదే పరిస్థితి. మరి ఈ సినిమాకి ఎలాంటివో ఓపెనింగ్స్ తెలుగులో వస్తాయో చూడాలి.