‘మహానటి’ సినిమా సైన్ చేయడానికి కారణం చెప్పిన స్టార్ హీరో !


‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, సినీ జనాల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. ఇందులో కీర్తి సురేష్, సమంతలతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడు. ఇందులో ఆయన జెమినీ గణేశన్ పాత్రను చేస్తున్నారు.

ముందు తనకు అప్పుడే డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనే ఆలోచన ఉండేది కాదని, అలాంటిది ‘మహానటి’ చిత్రానికి ఒప్పుకోవడానికి కారణం దర్శకుడు నాగ్ అశ్విన్ అని, ఏదో భిన్నంగా చేయాలనే అయన తపనే తనను ఈ సినిమాకు ఒప్పుకునేలా చేసిందని అన్నారు. ఇప్పటికే దుల్కర్ లుక్ టెస్ట్ కూడా పూర్తైపోయింది. ఇకపోతే ఈ సినిమాకు హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ డాని శాంచెజ్ లోపెజ్ వర్క్ చేస్తున్నారు.