రైతు పాత్రలో స్టార్ హీరో !

Surya1

తమిళ స్టార్ హీరో సూర్య 36వ చిత్రంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకె’ అనే సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమాలో సూర్య ఏ పాత్రలో కనిపించబోతున్నాడో అని తెలుసుకోవడానికి సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఎట్టకేలకు ఈ చిత్రంలో సూర్య పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో సూర్య రైతు పాత్రలో కనిపిస్తారని, రైతుల సమస్యల పట్ల పోరాడతారని తెలుస్తోంది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version