సందీప్ కిషన్ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా స్టార్ హీరో !

‘నక్షత్రం’ పరాజయంతో డీలా పడిన యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలోనే ‘కేరాఫ్ సూర్య’ తో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై కాస్తంత పాజిటివ్ బజ్ నెలకొంది. ‘నా పేరు శివ’ ఫేమ్ సుశీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక వచ్చే వారంలో జరిగే అవకాశముందట.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తమిళ స్టార్ హీరో సూర్య హాజరయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సూర్య గనులకు రాలేకపోతే ఆయన తమ్ముడు, హీరో కార్తీ అయినా వేడుకకు వచ్చే చాన్సుందని, మొత్తం మీద ఇద్దరి అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ముఖ్య అతిథిగా వస్తారని సమాచారం. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో సరైన విజయాన్ని అందుకోవాలని ఆశపడుతున్నారు సందీప్ కిషన్.