సరికొత్త లుక్ లో కనిపించనున్న స్టార్ హీరో !

ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే కథ, కథనం, నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు హీరో లుక్ ఎలా ఉంటుందనే అంశం కూడా చాలా ప్రధానమైంది. ముఖ్యంగా అభిమానులకు ఈ విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ. తమ హీరో కొత్తగా, స్టైలిష్ గా, అందంగా కనిపించాలని అందరూ ఆశిస్తారు. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులు హీరో లుక్స్ మీద ప్రతేయక దృష్టి సారిస్తుంటారు.

ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ 62వ చిత్రంలో కూడా ఇదే జరుగుతోంది. దర్శకుడు మురుగదాస్ విజయ్ ను ఇంతకుముందెన్నడూ చూడని గెటప్లో, అల్ట్రా స్టైలిష్ గా చూపించడానికి ట్రై చేస్తున్నారట, అందుకే ప్రముఖ డిజైనర్, స్టైలిస్ట్ పల్లవి సింగ్ ను ప్రాజెక్టులోకి తీసుకున్నారట. ఈమె గతంలో విజయ్ సూపర్ హిట్ సినిమా ‘మెర్సల్’ కు కూడా స్టయిలిష్ట్ గా పనిచేశారు.

మరి ఆ సినిమాలో వోయిజాయ్ ను మూడు గెటప్స్ లో అదిరిపోయేలా చూపించిన ఆమె ఈ సినిమాలో ఏ స్థాయిలో చూపెడతారో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది.