తల్లిదండ్రుల పైనే కేసు పెట్టిన స్టార్ హీరో !

Published on Sep 19, 2021 7:13 pm IST

తమిళ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌ తన తల్లిదండ్రుల పైనే కేసు పెట్టారు. ఈ వార్త విజయ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా షాక్ కి గురి చేసింది. ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. విజయ్‌ అభిమాన సంఘాల సమాఖ్యగా విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ అనే సంఘం ఉంది. అయితే, గత ఏడాది విజయ్‌ తండ్రి ఆ విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ ను ఒక రాజకీయ పార్టీగా ప్రకటించారు.

పైగా కేంద్ర ఎన్నికల సంఘంలో విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ ను ఒక రాజకీయ పార్టీగా కూడా రిజిస్టర్‌ చేయించారు. పైగా ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులే ఉన్నారు. అది విజయ్ కి నచ్చలేదు. అందుకే తన తండ్రి పెట్టిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆ మధ్య ఒక ప్రెస్ నోట్ వదిలారు. ఈ క్రమంలో విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును గానీ, అలాగే తన ఫొటోను గానీ వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయినా విజయ్‌ తల్లిదండ్రులు.. పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ విజయ్ పేరును వాడుతూనే ఉన్నారు. దాంతో తన పేరును వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయిస్తూ తన తల్లిదండ్రులతో సహా 11 మంది పై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టారు

సంబంధిత సమాచారం :