ఈ బాలీవుడ్ బిగ్ మూవీ నుండి తప్పుకున్న స్టార్ హీరో!

బాలీవుడ్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో హౌస్‌ఫుల్ 5 ఒకటి. ఈ చిత్రం లో ఎంతోమంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. అందులో అనీల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటించాల్సి ఉంది. ఇప్పుడు చివరి నిమిషంలో ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే పారితోషికం విషయంలో అనిల్ కపూర్ వాకౌట్ చేసినట్లు తెలిసింది. అనిల్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేయగా, నిర్మాతలు అందుకు సిద్ధంగా లేరు. కాబట్టి, కలత చెందిన అనిల్ కపూర్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు.

ఇప్పుడు అర్జున్ రాంపాల్‌ని ఆ పాత్రకోసం తీసుకున్నారు. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version