న్యూ ఇయర్ ట్రీట్ కి రెడీ అవుతోన్న స్టార్ హీరోస్ మూవీస్ ?

Published on Dec 28, 2022 9:39 am IST

కోలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోస్ గా సూపర్ క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో ఇళయదళపతి విజయ్, తలా అజిత్ కుమార్ ఇద్దరూ కూడా టాప్ ప్లేస్ లో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక వీరి నుండి మూవీస్ వస్తున్నాయి అంటే వారి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి క్యూరియాసిటి నెలకొని ఉంటుంది. ఇక తెలుగులో సైతం విజయ్, అజిత్ లకు మంచి క్రేజ్ ఉంది. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న వరిసు, అలానే హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్న మూవీ తునీవు సినిమాలు రెండూ కూడా 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్నాయి.

కాగా వీటిలో ముందుగా తునీవు మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 31న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా విజయ్ వరిసు మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 1న రిలీజ్ చేసేందుకు ఆ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోందట. మొత్తంగా 2023 న్యూ ఇయర్ సందర్భంగా అటు విజయ్, ఇటు అజిత్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ ట్రీట్ సిద్ధం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే వీటిపై ఆయా సినిమాల యూనిట్స్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :