బాలీవుడ్ సూపర్ లేడీ దీపికా పదుకొనె చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం ఛపాక్. ఆమె ఈ చిత్రంలో యాసిడ్ దాడికి గురైన యువతిగా కనిపించనున్నారు. లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందన అందుకుంది. ఈనెల 10న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ముంబైలో ఆడియో లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దీపికతో పాటు లక్ష్మీ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఈ చిత్రంలోని పాట పాడుతుండగా స్టేజీపై ఉన్న లక్ష్మీ చాలా ఎమోషన్ అయి కన్నీరు పెట్టుకుంది. దీంతో పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఒకానొక సందర్భంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
