ఖుషిలో మరో స్టార్ హీరోయిన్.. నిజమేనా ?

ఖుషిలో మరో స్టార్ హీరోయిన్.. నిజమేనా ?

Published on Jun 5, 2023 9:01 AM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో స్పెషల్ రోల్ ఉందట. సెకండాఫ్ లో వచ్చే ఈ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తోంది అని టాక్ నడుస్తోంది. మరి ఆ స్టార్ హీరోయిన్ విజయ్ దేవరకొండ కి మాజీ లవర్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఒకవేళ ఈ వార్త నిజం అయితే.. విజయ్ దేవరకొండ – సమంత మధ్యలో మరో స్టార్ హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో చూడాలి. ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ దేవరకొండ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు