భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న స్టార్ హీరోయిన్ !
Published on Oct 23, 2017 3:34 pm IST


తమిళ్ హీరో విక్ర‌మ్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అప్పట్లో ఈ హీరోకు స్టార్ డ‌మ్ తెచ్చిన మూవీ ‘సామి’. హరి దీనికి దర్శకత్వం వహించారు. ఇప్ప‌డు ఈ మూవీ సీక్వెల్ రానుంది, ‘సామి’ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రియే ఈ మూవీకి కూడా డైరెక్ట‌ర్. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి త్రిష తప్పుకుందని తెలుస్తోంది. దీనికి కారణాలేమిటో ఇంకా ఇంకా తెలిలేదు. ఢిల్లీ నేప‌థ్యంతో ఈ సినిమా ఉండబోతుంది. దీంతో షూటింగ్ ను అధిక భాగం ఢిల్లీలో తీయ‌నున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌లో నిర్మించ‌నున్నారు.

 
Like us on Facebook