తన రీసెంట్ ఫేవరెట్ మూవీ పుష్ప అని చెప్పిన స్టార్ హీరోయిన్!

తన రీసెంట్ ఫేవరెట్ మూవీ పుష్ప అని చెప్పిన స్టార్ హీరోయిన్!

Published on Nov 23, 2022 7:11 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ స్టైల్ కు, యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. చాలా మంది ఈ చిత్రం తో అల్లు అర్జున్ nu ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ రేంజ్ లో ఈ చిత్రం అంత ఇంపాక్ట్ చూపించింది. అలాగే, పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటనక అవార్డ్ లు సైతం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ సెషన్‌ను నిర్వహించింది. సౌత్ ఇండియా నుండి ఆమెకు ఇటీవల ఇష్టమైన చిత్రం ఏది అని అడిగినప్పుడు ఐకాన్ స్టార్ యొక్క తగ్గెదెలే మ్యానరిజాన్ని అనుకరిస్తూ, వెంటనే పుష్ప అని చెప్పింది. రకుల్ మాత్రమే కాదు, గతంలో చాలా మంది తారలు ఈ సినిమాపై తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్ సాధించడం తో రెండవ భాగం పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు