‘బాహుబలి నెట్ ఫ్లిక్స్ సిరీస్’లో స్టార్ హీరోయిన్ !


రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి-1, 2’ చిత్రాల ఏ స్థాయిలో విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను వెబ్ సిరీస్ రూపంలో తీసుకురానుంది. దేవా కట్ట మరియు ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్ ను దర్శకత్వం వహించినున్నారు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం ఏమిటి, ఆమె ఎదుగుదల ఎలా సాగింది.. ఇలా ప్రధానంగా శివగామి పాయింటాఫ్ వ్యూలో ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది.

ఈ వెబ్‌ సీరీస్‌ లోని ముఖ్య పాత్ర అయిన శివగామి పాత్రను, హిందీ నటి మృణాల్‌ థాకూర్‌ పోషిస్తున్నారు. కాగా, తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సీరీస్‌ లో స్టార్ హీరోయిన్ శ్రీయా శరణ్ కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

Exit mobile version