బాలయ్య భార్యగా స్టార్ హీరోయిన్ !

Published on Sep 19, 2021 4:01 pm IST

హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం లావు పెరిగే పనిలో పడింది. ఎందుకు ఈ అదనపు లావు అంటే.. నటసింహం బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్రలో ఆమె నటిస్తోంది. భార్య పాత్ర కాబట్టి.. కాస్త బరువు పెరిగితే బాగుంటుందని శృతి హాసన్ బరువు పెరుగుతుంది.

అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి మొదట ఈ సినిమాలో బాలయ్య సరసన వేరే హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. కానీ మలినేని గోపీచంద్, శృతి హాసన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడట. గోపీచంద్ మలినేని శృతి హాసన్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. అందుకే ఇప్పుడు బాలయ్య తో చేయబోయే సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారట.

సంబంధిత సమాచారం :