మరో బయోపిక్ లో నటించనున్న స్టార్ హీరోయిన్ !


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్ర గత కొన్నాళ్లుగా హిందీ సినిమాలు మానేసి తన హాలీవుడ్ డెబ్యూట్ చిత్రం ‘బే వాచ్’ పనుల్లో బిజీగా గడిపారు. తాజాగా ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్ని ముగించుకున్న ఆమె ముంబై తిరిగిచ్చారు. హాలీవుడ్ సినిమాలో నటించి ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదిగిన ప్రియాంక తర్వాతి చిత్రం ఏమిటనే ఆలోచనలో ప్రేక్షకులుండగానే బాలీవుడ్ చిత్ర వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే టాప్ దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా బన్సాలి ప్రముఖ పంజాబీ రచయిత్రి అమ్రిత ప్రీతమ్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ ను రూపొందిస్తున్నారట. అందులో ప్రియాంక చోప్రను లీడ్ రోల్ లో తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నారని, ఆ విషయంపై చర్చించేందుకే ప్రియాంక ముంబై వచ్చారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంతవరకు నియమవుతాయో తెలియలాంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. బయోపిక్ లో నటించడం ప్రియాంకకు కొత్తేమీ కాదు. గతంలో ఆమె బాక్సర్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రంలో నటించి అందరి ప్రసంశలు అందుకున్నారు.