‘జై లవ కుశ’ లో స్పెషల్ సాంగ్ చేయనున్న స్టార్ హీరోయిన్ ?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాకు మరో అట్రాక్షన్ జతకానుంది. అదేమిటంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఒకరు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందబోయే ఈ పాటకు తమన్నా అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను ఫైనల్ చేశారట. తమన్నా కుడా ప్రపోజల్ నచ్చడంతో ఓకే చెప్పారట.

అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఈ బలమైన వార్తలపై చిత్ర టీమ్ నుండి ప్రకటన వస్తే గానీ ఒక నిర్ణయానికి రావడానికి లేదు. ఎన్టీఆర్ గత చిత్రం ‘జనతా గ్యారేజ్’ లో కూడా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన ‘పక్కా లోకల్’ అనే ప్రత్యేక గీతం ఎంతలా సక్సెస్ అయిందో తెలిసిందే. అలాగే తమన్నా కూడా గతంలో ‘అల్లుడు శీను, జాగ్వార్’ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.