ఏమాత్రం తగ్గని త్రిష జోరు..!


దక్షణాది హీరోయిన్లలో వయసు పెరిగే కొద్దీ జోరు పెంచుతున్న హీరోయిన్ త్రిష అనే చెప్పాలి. త్రిష వయసు ముప్పై దాటినా ఆమె వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.ఈ ఏడాది ఇప్పటికే ఐదు చిత్రాలతో బిజీగా ఉన్న త్రిష మరో సినిమాని కుడా ప్రారంభించనుంది.

ఈ చిత్రానికి ఆసక్తి కరంగా ’96’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. జూన్ 12 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విజయ సేతుపతి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.త్రిష కెరీర్ లో ఇది 59 వ చిత్రం. ’96’ చిత్రం తోపాటు మరో త్రిష నటించిన మరో ఐదు చిత్రాలు 2017 లోనే విడుదల కానున్నాయి.