నితిన్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ స్టార్ హీరో కుమార్తె ?

shruti-haasan
‘అ..ఆ..’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో నితిన్ కాస్త ఎక్కువగానే గ్యాప్ తీసుకుని తన నెక్స్ట్ సినిమాని మొదలుపెడుతున్నాడు. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ ఫేమ్ హను రాఘవపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. కంప్లీట్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. నితిన్ ముందు సినిమా హిట్ కావడంతో ఈ సినిమాపై పెద్ద స్థాయిలోనే అంచనాలున్నాయి. అందుకే నిర్మాతలు సైతం సినిమాని భారీ స్థాయిలో రూపొందించాలని అనుకుంటున్నారట.

అందుకే ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరో కుమార్తె, ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్ అయితే బాగుంటుందని అనుకుని ఆమెను సంప్రదించారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం శృతి తండ్రి కమల్ తో కలిసి ‘శభాష్ నాయుడు’, పవన్ తో ‘కాటమరాయుడు’, సూర్యతో ‘సింగం 3’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు హిందీలో సైతం ఓ సినిమా చేస్తుంది. అందుకే శృతి నితిన్ సినిమా పట్ల సుముఖంగానే ఉన్నప్పటికీ డేట్స్ చూసి ఫైనల్ డెసిషన్ చెప్తానని చెప్పిందట. మరి ఈ కాంబినేషన్ కుదురుతుందా లేదా తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.