స్టార్ హీరో తల్లికి గుండెపోటు.. లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే !

స్టార్ హీరో తల్లికి గుండెపోటు.. లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే !

Published on Oct 31, 2022 10:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ తీవ్ర గుండెపోటుకు గురైనట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే, ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. జీనత్ హుస్సేన్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ ప్రకారం చికిత్సకు ఆమె బాగా స్పందిస్తున్నారు. రీసెంట్ గా అమీర్ మరియు అమీర్ ఖాన్ కుటుంబం తమ పంచగని నివాసంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఆ దీపావళి వేడుకల్లో కూడా జీనత్ హుస్సేన్ చురుగ్గా పాల్గొన్నారు. కానీ అంతలోనే అమీర్ తల్లికి తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు తేరుకుని, ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయంపై అమీర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ తో పాటు మిగతా కుటుంబసభ్యులు కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు