‘అర్జున్ రెడ్డి’ రీమేక్లో స్టార్ హీరో కుమారుడు !


‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగునాట భారీ విజయాన్ని అందుకోవడమేగాక అన్ని చిత్ర పరిశ్రమల్ని తన వైపుకు తిప్పుకుంది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కుల్ని ఇతర ముఖ్య పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కొనుగోలు చేశారు కూడ. ఇకపోతే ఈ చిత్రం యొక్క తమిళ రీమేక్లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించనున్నాడు. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా ప్రకటించారు.

ఈ సినిమాతోనే ధ్రువ్ కు సినీ రంగ ప్రవేశం చేస్తుండటం విశేషం. గత కొన్నేళ్లుగా నటుడిగా అన్ని రకాల మెళుకువల్ని నేర్చుకుంటున్న ధ్రువ్వ్ కు నటనకు పూరిగా ఆస్కారమున్న ఈ ప్రాజెక్ట్ దక్కడం మంచి అవకాశమనే చెప్పాలి. మరి తెలుగులో ఇంతటి ఘన విజయాన్ని అందుకుని, విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టిన ఈ చిత్రం ధ్రువ్ కు ఎలాంటి ఇమేజ్ ఇస్తుందో చూడాలి. ఇకపోతే ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఇతర తారాగణం ఎవరు అనే విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది.