సొంత వ్యాపారం మొదలుపెట్టిన బన్నీ సతీమణి

Allu-Arjun,-wife
స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సొంత వ్యాపారం మొదలుపెట్టారు. ‘పికాబు’ అనే కొత్త స్టార్టప్ కంపెనీని ఆమె సొంతం చేసుకున్నారు. పికాబు అనేది ఫోటో స్థూడియోస్ సంస్థ. కొత్తగా తల్లిదండ్రులైన వారు, వారి పిల్లల్ని అందంగా, క్రియేటివ్ గా ఫోటోలు తీయడం ఈ స్థూడియోస్ ప్రత్యేకత. ఇంతకూ మునుపు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వారి ముద్దుల కుమారుడు అయాన్ ఫోటోలను అద్భుతంగా క్యాప్చర్ చేసింది ఈ సంశకు చెందిన ఫోటోగ్రాఫర్లే.

మరిప్పుడు స్నేహా రెడ్డే స్వయంగా ఈ సూడియోస్ ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్నే తెలుపుతూ ‘పికాబు అనేది నా భార్య స్నేహా రెడ్డి కొత్తగా స్టార్ట్ చేస్తున్న స్టార్టప్ కంపెనీ. ఇది ఒక ఫోటో స్థూడియో. మనుషుల జీవితాల్లోని మర్చిపోలేని అనుభూతులను, సందర్భాలను అద్భుతంగా క్యాప్చర్ చేయడం దీని ప్రత్యేకత’ అంటూ మునుపు ఈ స్థూడియోస్ ద్వారా వాళ్ళు తీయించుకున్న కొన్ని మెమరబుల్ ఫోటోలను షేర్ చేసుకున్నాడు.