త్వరలో “స్టార్ మా”లోకి మరో సరికొత్త ధారావాహిక..!

Published on Nov 29, 2021 11:00 pm IST


మన నిజజీవితంలో జరిగే ఎన్నో సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఒక్క రోజు చూస్తే చాలు ప్రతి రోజూ చూడాలనిపించేలా ఆ సమయానికి ఇంటిల్లిపాదిని టీవీల ముందు కట్టిపాడేసే ధారావాహికలు మన ముందుకు ఎన్నో వచ్చాయి. అయితే అలాంటి ధారావాహికలను మరిపించేలా స్టార్ మా లో సరికొత్త ధారావాహిక “కలసి ఉంటే కలదు సుఖం” త్వరలో రాబోతుంది.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. బంధం, బంధుత్వాలు మెండుగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ అనుబంధాలు ఏ ఇంట్లో కనిపించడం లేదు. మరీ ఆ అనుబంధాలు తన కుటుంబలో లేవని తెలుసుకున్న ఓ తల్లి ఏం చేయబోతుందనేది ఈ ధారావాహిక చెప్పబోతుంది.

సంబంధిత సమాచారం :