ఈ వారం ఫన్ అండ్ టెన్షన్ గా సిక్స్త్ సెన్స్ 4

Published on Aug 17, 2021 2:25 pm IST


స్టార్ మా చేస్తున్న కార్యక్రమాల్లో ఓంకార్ యాంకర్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ 4 బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శని మరియు ఆదివారాల్లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం కి ఆదరణ పెరుగుతోంది. ఈ వారం ఫన్ అండ్ టెన్షన్ గా ఉంటుంది అని చెప్పాలి. తాజాగా స్టార్ మా సిక్స్త్ సెన్స్ 4 కి సంబంధించిన ఒక ప్రోమో ను విడుదల చేయడం జరిగింది. ఇందులో గెటప్ శ్రీను మెగాస్టార్ చిరంజీవి పాటకు డాన్స్ లతో అలరించగా, కార్యక్రమం సైతం ఎంతో ఆసక్తిగా జరిగింది. ఎక్కువగా ఫన్ మరియు టెన్షన్ తో కూడిన ఈ ప్రోగ్రాం ఈ వారం శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :