టాక్ : రామ్ – బోయపాటి మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ …?

Published on Sep 11, 2022 3:04 am IST


టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఇటీవల ది వారియర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి తీశారు. అయితే రిలీజ్ తరువాత ఈ మూవీ అనుకున్న స్థాయి విజయం అందుకోలేకపోయింది. దానితో నెక్స్ట్ మూవీ విషయమై ఒకింత గట్టిగా ఆలోచన చేసిన రామ్, తదుపరి మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు.

ఇటీవల ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కి సెన్సేషనల్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ త్రయం ముగ్గురూ కలిసి దిగిన లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ రెడీ చేసిన బోయపాటి, ప్రస్తుతం స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే వీలైనంత త్వరలో మూవీని పట్టాలెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి ఇతర వివరాలు తెలియాలి అంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :