క్రేజీ బజ్ : విజయ్ దేవరకొండ తో స్టార్ ప్రొడ్యూసర్ భారీ మూవీ ?

Published on Feb 5, 2023 5:29 pm IST


యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ నటి సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా అతి త్వరలో దీని తదుపరి షెడ్యూల్ జరుగనుంది. రొమాంటిక్, లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్.

ఇక దీని తరువాత ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి తో ఒక మూవీ అనౌన్స్ చేసారు విజయ్ దేవరకొండ. అయితే దాని అనంతరం ప్రముఖ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో విజయ్ దేవరకొండ ఒక భారీ మూవీ చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇటీవల విజయ్ తో గీత గోవిందం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి సంబందించి ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యాయని అతి త్వరలో ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :