అద్దెకు థియేటర్.. ఫ్యామిలీతో కలిసి నచ్చిన సినిమా చూసే ఛాన్స్..!

Published on Jan 4, 2022 9:37 pm IST

కరోనా మహమ్మారి మొదలైనప్పటి థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడాలంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ భయపడిపోతున్నారు. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అందుబాటులో ఉన్నా థియేటర్‌లో సినిమాను చూసిన ఫీల్‌ని అయితే వారు పొందలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా స్టార్‌ ట్రాక్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ థియేటర్‌ను అద్దెకు తీసుకుని మనకి నచ్చిన సినిమాను ఫ్యామిలీతో చూసేయొచ్చు.

ఈ ఫ్యామిలీ థియేటర్‌ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తుండగా.. షో టైమింగ్‌, వారాన్ని బట్టి ఒక్కో షోకి కనిష్టంగా రూ.1500ల నుంచి రూ.1900ల వరకు రెంట్‌ వసూలు చేస్తారు. ఈ రెంటెండ్‌ థియేటర్‌లో కరోనా భయాలు లేకుండా సినిమాలను ఆస్వాదించవచ్చు. ప్రతీ షో తర్వాత థియేటర్‌ మొత్తాన్ని ఆధునిక పద్దతిలో శానిటైజ్‌ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ థియేటర్‌లో ఫ్యామిలీ ఫంక‌్షన్‌ వీడియోలతో పాటు అన్ని ఓటీటీలలో వచ్చే సినిమాలను కూడా చూడొచ్చు.

అయితే మల్టీప్లెక్స్ స్థాయిలో నిర్మించిన ఈ థియేటర్‌లో ఏడుగురు కుటుంబ సభ్యుల వరకు సినిమా చూసే ఛాన్స్ ఉంది. 142 ఇంచెస్‌ ఆధునిక స్క్రీన్‌, పవర్‌ఫుల్ ఆడియో సిస్టమ్‌, రిక్లెయినర్‌ చైయిర్లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌ సర్థార్‌పటేల్‌ రోడ్‌లో ఉన్న ఈ థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే స్టార్‌ ట్రాక్‌ గ్రూప్‌కి చెందిన వెబ్‌సైట్‌కి వెళ్లి షోని బుక్‌ చేసుకోవాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :