వైరల్ పిక్స్ : నేషనల్ అవార్డుల వేడుకలో సందడి చేసిన స్టార్స్

Published on Oct 1, 2022 2:00 am IST

ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా జాతీయ అవార్డుల వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఇక 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల్లో మన తెలుగు నుండి అలవైకుంఠపురములో మూవీకి గాను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అలానే నాట్యం మూవీకి రెండు అవార్డులు లభించాయి.

ఇక తమిళ్ లో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సూరారై పోట్రు మూవీకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మూవీ, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్యాటగిరీల్లో అవార్డులు లభించాయి. అలానే మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం మూవీకి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్, బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ క్యాటగిరీల్లో అవార్డులు దక్కాయి.

ఇక నేటి ఈ అవార్డుల వేడుకలో హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డైరెక్టర్ సుధా కొంగర, వంటి వారు తమ ఆనందాన్ని పంచుకుంటూ పలు ఫోటోలు దిగి తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అందరికీ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

సంబంధిత సమాచారం :