చెక్కు చెదరని “బాహుబలి 2” సాలిడ్ రికార్డ్.!

Published on Dec 10, 2021 3:31 pm IST

ఇండియన్ సినిమా దగ్గర చెరగని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “బాహుబలి 2”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి లతో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ఈ భారీ చిత్రం గత 2017లో విడుదలై ఇండియన్ సినిమా దగ్గరే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నుంచే నాన్ బాహుబలి రికార్డ్స్ అనే సంప్రదాయం కూడా స్టార్ట్ అయ్యింది.

మరి ఈ లెక్కన బాహుబలి మ్యానియా ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి 1 కి కొనసాగింపుగా చాలా సస్పెన్స్ తో వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో అయితే సంచలనం. పలు వరల్డ్ లెవెల్ సినిమాలను మించి ఈ సినిమా ట్రైలర్ కి రెస్పాన్స్ వచ్చింది.

మరి ఇప్పుడు దీనిని మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా “RRR” ఇదే రాజమౌళి చేసింది బ్రేక్ చేస్తుంది అనుకున్నారు కానీ జస్ట్ లో ఈ భారీ రికార్డు మిస్ అయ్యింది. దీనితో 24 గంటల్లో అత్యధికంగా చూసిన సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ గా 21.8 మిలియన్ వ్యూస్ తో చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. నాలుగేళ్లు అయినా కూడా ఈ రికార్డ్ బ్రేక్ అవ్వకుండా ఉండడం విశేషం.

సంబంధిత సమాచారం :