“RRR” కి మాత్రం ఇంకా తగ్గని భారీ స్థాయి ఆదరణ.!

“RRR” కి మాత్రం ఇంకా తగ్గని భారీ స్థాయి ఆదరణ.!

Published on May 18, 2022 9:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన లేటెస్ట్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అంతే రీతిలో రికార్డు స్థాయి వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్లింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ 50 రోజులు పైనే అయ్యిపోయింది.

మరి అయినప్పటికీ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ సహా ఆయా దేశాల ప్రముఖులు నుంచి ఇప్పటికీ ఈ సినిమాపై ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. అలాగే ఇంకో పక్క అయితే ఈ జూన్ 1 న యూఎస్ లో ప్లాన్ చేసిన ఒరిజినల్ కట్ వెర్షన్ రిలీజ్ కి కూడా భారీ స్థాయి రెస్పాన్స్ వస్తుంది అని తెలుస్తుంది. అలాగే ఆ స్పెషల్ స్క్రీనింగ్ కి సంబంధించి కూడా భారీ వసూళ్లు వచ్చే ఉందట. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు