ఇప్పటికీ ఫారినర్స్ లో “RRR” కి రోరింగ్ రెస్పాన్స్.!

ఇప్పటికీ ఫారినర్స్ లో “RRR” కి రోరింగ్ రెస్పాన్స్.!

Published on Nov 6, 2022 9:07 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. విజనరీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ పెద్ద హిట్ గా నిలవగా నెక్స్ట్ కూడా ఓటిటి లో వచ్చాక పాన్ వరల్డ్ వైడ్ చిత్రం గ్లోబల్ రీచ్ ని సొంతం చేసుకుంది. ఇక అక్కడ నుంచి ఈ చిత్రం ఫారిన్ ఆడియెన్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ని కూడా నోచుకుంటూ వచ్చింది.

అలా పలు దేశాల్లో ఐమ్యాక్స్ లలో గాను స్పెషల్ షో లు చేస్తుండగా వాటికి ఇప్పటికీ కూడా భారీ రెస్పాన్స్ వస్తూ ఉండడం విశేషం. లేటెస్ట్ గా న్యూ యార్క్ లో ఈ చిత్రం భారీ ఐమ్యాక్స్ లో షో వేయగా అందులో వీడియో విజువల్ ని మేకర్స్ పంచుకున్నారు. ఈ షో లో అయితే మళ్ళీ RRR టైటిల్ సీన్ కి అక్కడి ఆడియెన్స్ రోరింగ్ రెస్పాన్స్ ని అయితే అందించారు. దీనితో ఈ సినిమాకి మాత్రం ఎక్కడా కూడా క్రేజ్ తగ్గడం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు