షూటింగ్స్‌ నిలిపివేయడం సరికాదు – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

komatireddy venkat reddy

టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. కాగా 30 శాతం వేతనం పెంచి ఇస్తామన్న నిర్మాతల ఒప్పంద పత్రాన్ని ఫెడరేషన్‌ ద్వారా యూనియన్‌లకు తెలియజేసిన తర్వాతే షూటింగ్స్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సభ్యులెవరూ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్‌కు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే, పని చేస్తూనే తమ డిమాండ్స్‌ నెరవేర్చుకోవాలని, షూటింగ్స్‌ నిలిపివేయడం సరికాదని ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు.

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. మరోవైపు, నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు.. మంత్రితో భేటీ అయ్యారు. వేతన పెంపును సినీ కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్‌ ను నిర్మాతలు ఒప్పుకుంటారా ? లేదా ? అనేది తేలాల్సి ఉంది.

Exit mobile version