“భీమ్లా నాయక్” కి సాలిడ్ ప్రమోషన్స్ చేస్తున్న “ఆహా”.!

Published on Mar 19, 2022 6:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం తెలిసిందే. గత ఫిబ్రవరిలో విడుదల అయ్యిన ఈ చిత్రం మరి పవన్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంటుంది.

మరి ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న అభిమానులకు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ “ఆహా” మరియు ‘డిస్నీ+ హాట్ స్టార్’ వారు ఈ మార్చ్ 15 న భీమ్లా ప్రీమియర్ పడబోతున్నట్టు అనౌన్సమెంట్ ఇచ్చారు. మరి ఇదిలా ఉండగా స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు అయితే భీమ్లా నాయక్ ఓటిటి ప్రీమియర్ కి గాను సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు.

ఆన్లైన్ లో ఆల్రెడీ క్రేజీ టీజర్ కట్స్ తో అలరిస్తుండగా ఆఫ్ లైన్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద పెద్ద హోర్డింగులు అలాగే ఆహా ట్రైలర్ కట్ కి ఫ్యాన్స్ నే తీసుకొచ్చి లాంచ్ చెయ్యడం వంటివి గట్టిగానే చేస్తున్నారు. మొత్తానికి అయితే భీమ్లా ప్రీమియర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి మాత్రం ఇవి మంచి ట్రీట్ గా మారాయి.

సంబంధిత సమాచారం :