టాక్..పవన్, బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే?

Published on Jan 27, 2023 9:00 am IST

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు ఎప్పటికప్పుడు సరికొత్త క్రియేటివ్ కంటెంట్ తో ఆడియెన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. మరి అలా నందమూరి నటసింహ బాలయ్య తో మొదటిసారిగా ఓ టాక్ షో ని హోస్ట్ గా పెట్టి చేశారు. అదే “అన్ స్టాప్పబుల్”. విజయవంతంగా రెండో సీజన్లో కి వచ్చిన ఈ క్రేజీ షో ఇప్పుడు మరింత మంది బిగ్ స్టార్స్ గెస్టులుగా ప్రసారం అవుతుంది.

అలా రీసెంట్ గానే ప్రభాస్ తో బాహుబలి ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఇక నెక్స్ట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సెన్సేషనల్ ఎపిసోడ్ ని అయితే ప్లాన్ చేశారు. మరి మంచి హైప్ ఉన్న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఇప్పుడు ఆ డేట్ పై క్లారిటీ ఇప్పుడు వినిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ ఎపిసోడ్ ఈ ఫిబ్రవరి 3 న ఆహా స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. మరి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :