ఈ ఓటిటి యాప్ లో భారీ చిత్రం “పొన్నియిన్ సెల్వన్”.!

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో కాలంగా మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి భారీ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్” కోసం అందరికీ తెలిసిందే. లెజెండరీ దర్శకుడు మణిరత్నం చియాన్ విక్రమ్ హీరోగా, కార్తీ, జయం రవి తదితర ఎంతోమంది బిగ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం పై ఇప్పుడు ప్రమోషన్స్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు.

అలాగే తమిళ్ నుంచి చాలా కాలం తర్వాత ఓ భారీ పీరియాడిక్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం టీజర్స్ కూడా ఈ మధ్య ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ భారీ సినిమా ఓటిటి డీల్ కి సంబంధించి డీటెయిల్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఈ చిత్రం తాలూకా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేశారు.

సో థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన కొన్ని వారాలకి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతుంది.

Exit mobile version