స్ట్రీమింగ్ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఉగ్రం”.!

స్ట్రీమింగ్ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఉగ్రం”.!

Published on May 5, 2023 10:00 AM IST

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు ‘అల్లరి’ నరేష్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మిర్న హీరోయిన్ గా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం “ఉగ్రం”. మరి ఈ వారం రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. నరేష్ మరియు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో నాంది తర్వాత రెండో సినిమాగా మంచి బజ్ నడుమ అల్లరి నరేష్ సాలిడ్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది.

ఇక ఈ చిత్రం అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి రానుందో కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రం తాలుకా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అయితే సొంతం చేసుకున్నారట. ఇక ఇందులో కొన్ని వారాల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానుంది అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు