“లైగర్” నుండి అప్డేట్స్ షురూ…రేపు సినిమా విడుదల పై కీలక ప్రకటన!

Published on Sep 26, 2021 4:35 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పతాకం పై కరణ్ జోహార్, ఛార్మి కౌర్, అపూర్వ మెహతా, హీరో యశ్ జోహార్ మరియు జగన్నాథ్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ ను చిత్ర యూనిట్ షురూ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది. రేపు అనగా, సెప్టెంబర్ 27 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం కి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలపడం జరిగింది. ఈ చిత్రం విడుదల పై ఒక క్లారిటీ రానుంది. లైగర్ అనే ఈ సినిమా కి సాల క్రాస్ బ్రీడ్ ను క్యాప్షన్ గా జత చేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ ను ప్రకటించినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :