రెండవ వారంలోనూ ‘ధృవ’ ప్రభంజనం !

dhruva-3rd
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ ఈ నెల 9న విడుదలై ఘన విజయం దిశగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఫ్లాపుల తరువాత తీసినసినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఏర్పరుచుకున్నారు. హీరో చరణ్ కూడా ఎలాగైనా సక్సెస్ ఉద్దేశ్యంతో బాగా కష్టపడి ప్రాజెక్టుపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అంతా అనుకున్నట్టే జరిగి సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కరెన్సీ బ్యాన్ మూలంగా మొదటి వారం వచ్చినన్ని కలెక్షన్స్ రెండవ వారంలో రావని అందరూ అభిప్రాయపడ్డారు.

ఆ అభిప్రాయం ప్రకారం కరెన్సీ కొరత ప్రభావం వలన బి, సి సెంటరల్ వద్ద సినిమా వసూళ్లు కాస్త పల్చబడినప్పటికే ఏ సెంటర్లలో మాత్రం వసూళ్లు మొదటి వారంలాగే బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ 10 రోజుల షేర్ వివరాలు చూస్తే నైజాం రూ. 12. 5 కోట్లు, వైజాగ్ – రూ.4. 5 కోట్లు, సీడెడ్ – 5. 7కోట్లు, ఈస్ట్, వెస్ట్ కలిపి రూ. 4.8 కోట్లు, ఓవర్సీస్ రూ.6.1 కోట్లు, ఇంకా ఇతర ఏరియాలు కలుపుకుని మొత్తం రూ. 48 కోట్లు టచ్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.