స్ట్రాంగ్ బజ్..”వరిసు” కన్నా ముందే అజిత్ రానున్నాడట.!

Published on Dec 7, 2022 3:02 pm IST

వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా యుద్ధం అయితే ఇప్పుడు నుంచే మంచి ఆసక్తిగా మారింది. మన టాలీవుడ్ తో పాటుగా తమిళ్ సినిమా దగ్గర బాక్సాఫీస్ క్లాష్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అక్కడి స్టార్ హీరోలు అజిత్ కుమార్ మరియు దళపతి విజయ్ ల “తునివు” మరియు “వారిసు” చిత్రాలు రానున్నాయి. మరి తెలుగులో కూడా ఈ చిత్రాలు ఒకటి “తెగింపు”, ఒకటి “వారసుడు” గా రానున్నాయి.

అయితే ఈ చిత్రాల్లో ఏది మొదటిగా రిలీజ్ అవుతుంది అనేది కేజ్రీగా మారగా వారిసు అయితే 12జనవరి న వస్తున్నట్టుగా లాక్ అయ్యింది. అయితే సరిగ్గా ఇదే డేట్ న అజిత్ సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అయితే స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ముందు అయితే అజిత్ సినిమానే అంటే జనవరి 11 రిలీజ్ తో సంక్రాంతి పోరు స్టార్ట్ చేయనున్నట్టుగా ఇప్పుడు వినికిడి. జస్ట్ దీనిపై అధికారిక అప్డేట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది, కాగా ఇది ఈ వారం రోజుల్లో డిసైడ్ కానున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :