ప్రస్తుతం నందమూరు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా హిట్ దర్శకుడు బాబీ కొల్లి తో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్నా సినిమా కావడంతో దీనిపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పెద్దగా హంగామా లేకుండానే కంప్లీట్ అయ్యిపోతుంది.
అయితే ఈ చిత్రం ఇతర అప్డేట్స్ తో పాటుగా రిలీజ్ ఎప్పుడు అనేది కూడా ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ జూలై మూడు లేదా నాలుగో వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. అంటే ఈ జూలై 19 లేదా 26 తేదీలలో బాలయ్య బ్లాస్ట్ ఉండబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ తదితరులు నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.