స్ట్రాంగ్ బజ్..తారక్ భారీ సినిమాకి కి ఈమె ఫిక్సేనా..?

Published on Jan 14, 2022 10:32 am IST

టాలీవుడ్ మాస్ అగ్ర హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు తారక్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” దాదాపు మూడేళ్ళ తర్వాత రిలీజ్ అవుతుంది అనుకునే లోపే మళ్ళీ బ్రేక్ పడింది. అయితే ఇక ఈ సినిమా అనంతరం తారక్ శాలి లైనప్ నే సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మరి మొదటగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో లార్జ్ స్కెల్ లో భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.

మరి ఈ సినిమాకి మొదటి నుంచి కూడా హీరోయిన్ మరియు సంగీత దర్శకుడు ఎవరు అనే దాని పట్ల ఆసక్తి కొనసాగుతూనే ఉంది. మరి మళ్ళీ గత కొన్ని రోజులు నుంచి ఫిల్మ్ సర్కిల్స్ సహా సోషల్ మీడియా వర్గాల్లో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నే ఫిక్స్ అయ్యినట్టుగా మరలా స్ట్రాంగ్ బజ్ స్టార్ట్ అయ్యింది. మరి అసలు మ్యాటర్ ఏంటో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :