సలార్ రిలీజ్ ను టార్గెట్ చేస్తున్న ‘స్కంద’

Published on Sep 4, 2023 6:02 pm IST

డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో స్కంద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అవుతుందని టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న ‘సలార్’ సినిమా కూడా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే, స్కంద – సలార్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ కావడం జరిగే విషయం కాదు.

కాబట్టి.. ఈ రెండు సినిమాల్లో ఏదొక సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకునే అవకాశం ఉంది. అన్నట్టు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ చిత్రం కూడా సెప్టెంబర్ 28వ తేదీనే విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి స్కంద – సలార్ సినిమాల రిలీజ్ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :