మరోసారి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న ‘పవన్ కళ్యాణ్’..!

19th, July 2016 - 12:58:53 PM

pawan-kal
‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ భారీ అంచనాల నడుమ విడుదలై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయానికి ఉన్న ప్రధాన కారణాల్లో పవన్ సొంతంగా స్క్రిప్ట్ వర్క్ చేయడం కూడా ఒక కారణమని విమర్శకులు, సినీ జనాలు అభిప్రాయపడ్డారు. గతంలో కూడా పవన్ స్క్రిప్ట్ వర్క్ అందించిన సినిమాలు పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

మళ్లీ ఇప్పుడు పవన్ తాను దర్శకుడు ‘డాలి’ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రానికి సైతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే మునుపు జరిగిన తప్పులేవీ ఇందులో రిపీట్ కాకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట పవన్. ఇకపోతే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని, అంతేగాక ఈ సినిమాలో పవన్ చాలా హుందాగా కనిపిస్తాడని తెలుస్తోంది.